న్యూఢిల్లి : రష్యానుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు డిస్కౌంట్‌తో బ్యారల్ ధర 70 డాలర్ల కన్నా తక్కువ ఉండేట్టు చూడాలని రష్యాతో భారత్ బేరసారాలాడుతోంది. ఒపెక్ దేశాలతో వ్యవహారాలో రిస్క్‌ని ఎదుర్కొనేందుకు వీలుగా రష్యా వీలైనంత ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలని భారత్ కోరుతున్నది. ఈ ఆయిల్‌ని కొనుగోలు చేయడానికి నిధుల సేకరణ వంటి రిస్క్‌లను అధిగమించేందుకు ధరలో మరింత రాయితీ ఇవ్వాలని ఇండియా కోరనున్నది. ప్రభుత్వ అధీనంలోని రిఫైనరీలు, ప్రయివేట్ రిఫైనరీలు గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా నుంచి 400 మిలియన్ బ్యారళ్ల క్రూడ్ చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి కొనుగోలు చేసిన దానికన్నా ఇది 20 శాతం ఎక్కువ.
బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారల్‌కి 108 డాలర్లు ఉంది. భారత్ తన అవసరాల్లో 85 శాతం క్రూడ్‌ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలనీ, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వాలని అమెరికా, దాని మిత్ర దేశాలు భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే, రష్యా చమురు దిగుమతులపైనా, ఆయుధాలపైనా భారత్ ఆధారపడి ఉన్నందున అమెరికా, తదితర దేశాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా భారత్ తలొగ్గడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..