భారత్‌లో జనాభా అధికంగా ఉన్నా అభివృద్ధి విషయంలో అమెరికా తర్వాతే భారత్ ఉంటుంది. కానీ ఓ విషయంలో భారత్ అమెరికాను అధిగమించింది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా ఇండియా నిలిచింది. పని వాతావరణం, వ్యయ పోటీతత్వం కారణంగా భారతదేశం ఈ స్థానాన్ని సాధించింది. ఇదేకాకుండా, భారతదేశం ఔట్‌సోర్సింగ్ అవసరాలను కూడా నెరవేర్చింది. ఈ విభాగంలో కూడా ర్యాంకింగ్ మెరుగుపడింది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కుష్మన్ & వేక్‌ఫీల్డ్ విడుదల చేసిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్-2021 ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా చైనా ఉన్నది. ఒక స్థానం ఎగబాకి, రెండో స్థానానని భారతదేశం హస్తగతం చేసుకుంది. గత ఏడాది నివేదికలో, అమెరికా రెండవ స్థానంలో, భారతదేశం మూడో స్థానంలో ఉన్నాయి. యూరప్, అమెరికా, ఆసియా-పసిఫిక్‌లోని 47 దేశాల్లో తయారీకి ఆకర్షణీయమైన ప్రదేశాలను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. అమెరికాకు 3వ స్థానం, కెనడా 4వ, చెక్ రిపబ్లిక్ 5వ, ఇండోనేషియా ఆరవ, లిథువేనియా ఏడో, థాయ్‌ల్యాండ్ 8వ, మలేషియా 9వ, పోలాండ్ 10వ స్థానంలో ఉన్నాయి. అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలతో పోలిస్తే చాలా మంది తయారీదారులు భారతదేశంలో తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి: పిలిస్తే పలుకుతున్న కోడి.. అమాంతం పెరిగిన వ్యాపారం