Saturday, November 23, 2024

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో.. భారత్‌ నంబర్‌వన్‌!

వెస్టిండీస్‌ను టీ20 సిరీస్‌లోనూ వైట్‌వాష్‌ చేసిన టీమిండియా టీ20ఫార్మాట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. 3-0తేడాతో విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి టాపర్‌గా నిలిచింది. ఇంతకుముందు పొట్టిఫార్మాట్‌లో టీమిండియా చివరిసారి 2016లో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఆరేళ్ల తర్వాత మళ్లిd అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసీసీ వెల్లడించిన పాయిట్ల పట్టికలో టీమిండియా 269 రేటింగ్‌తో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లండ్‌ సైతం 269రేటింగ్‌తోనే ఉన్నా పాయింట్లపరంగా భారత్‌ కంటే వెనుకుంది. పాకిస్థాన్‌ రేటింగ్‌ 266, న్యూజిలాండ్‌ రేటింగ్‌ 255, సౌతాఫ్రికా 253, ఆస్ట్రేలియా 249 పాయింట్లుతో ఉన్నాయి. భారతజట్టు 10,484 పాయింట్లుతో ఉండగా ఇంగ్లండ్‌ జట్టు 10పాయింట్లు తక్కువగా 10,474తో రెండోస్థానంలో కొనసాగుతుంది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వరుసగా టాప్‌-5లో నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement