ముంబై : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) తర్వాత రేపట (బుధవారం) నుంచి విండీస్ లోని రోసోలోని విండ్సర్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు సిరీస్‌కు టీమ్ ఇండియా సిద్ధమైంది. చివరిసారిగా భారతదేశం లండన్‌లోని ఓవల్‌లో జూన్ 7న ఆస్ట్రేలియాతో ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కొత్త కిట్ స్పాన్సర్‌లు అడిడాస్‌తో రెడ్ బాల్ క్రికెట్ ఆడింది. అయితే ఈ కొత్త స్పాన్సర్ జెర్సీ క్రికెట్ అభిమానులకు బాగా నచ్చింది. జెర్సీ కలర్స్ తో పాటు ముఖ్యంగా జెర్సీ ముందు భాగంలో ‘ఇండియా’ అని వ్రాసి ఉండటం జెర్సీ కి మంచి అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే తాజాగా.. డ్రీమ్ 11 ఈ నెల ప్రారంభంలో ఇండియన్ టీమ్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది. స్పోర్టింగ్ జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెల్ఫీని పోస్ట్ చేశాడు.. అందులో ఇండియా అనే పేరు కు బదులుగా డ్రీమ్ 11 ఉండటం భారత క్రికెట్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. జెర్సీ ముందు భాగంలో ఉన్న ఇండియా అనే పేరును తుడిచిపెట్టారు.. దానికి బదులుగా, జెర్సీ పై డ్రీమ్ 11అంటూ స్పాన్సర్ల బ్రాండ్ పేరును ముంద్రించేశారు. దీంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బాగా మండింది.. ”ఇది ఇండియా జట్టా…. డ్రీమ్ 11 జట్టా” అంటూ బిసిసిఐని దుమ్మెత్తిపోస్తున్నారు.. మరి అభిమానుల ఆగ్రహానికి బిసిసిఐ స్పందిస్తో లేదో చూడాలి మరి..