Friday, November 22, 2024

దేశంలో 3 లక్షలకు చేరువలో కరోనా మరణాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 2,40,842 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వరుసగా ఏడో రోజు మూడు లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2,65,30,132కు పెరిగాయి. శనివారం నాడు దేశంలో 3,741 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,99,266గా నమోదైంది.

మరో వైపు పెద్ద ఎత్తున బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 3,55,102 బాధితులు డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 2,34,25,467 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 28,05,399 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 19,50,04,184 డోసులు వేసినట్లు పేర్కొంది. కాగా శనివారం నాడు దేశవ్యాప్తంగా 21,23,782 కోవిడ్‌ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 32.86 కోట్ల కరోనా టెస్టులను చేసినట్లు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement