Friday, November 22, 2024

ఇండియా వ్యాక్సిన్@60 కోట్ల డోసులు..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ మరో మరో మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెరగడంపై సంతోసం వ్యక్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌ 5లోగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్‌ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరింది.

ఇక దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,164 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.25 కోట్లకు చేరాయి. నిన్న మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 200మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ రోజు కూడా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే తక్కువగా ఉంది. తాజాగా 34,159 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.63 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు

ఇది కూడా చదవండి: Petrol price: పెట్రోల్ బంక్ లో బైక్ దగ్దం చేసి నిరసన..

Advertisement

తాజా వార్తలు

Advertisement