Saturday, November 23, 2024

దేశంలో స్థిరంగా కొనసాగుతోన్న కరోనా కేసులు..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతిరోజుల 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో నిన్న కొత్తగా 30,570 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,47,325కి చేరింది. అలాగే, నిన్న 38,303 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 431 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,928కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,60,474 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,42,923 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 64,51,423 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 76,57,17,137 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 17,681 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో 208 మంది కరోనా రోగులు మృతి చెందారు.

ఇది కూడా చదవండి: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు…

Advertisement

తాజా వార్తలు

Advertisement