ఇండియాలో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,870 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కి చేరింది. ఇందులో 3,29,86,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,82,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, భారత్‌లో కరోనాతో గడిచిన 24 గంటల్లో 378 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గడిచిన 24 గంటల్లో 28,178 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. 24 గంటల్లో ఇండియాలో 54,13,332 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 87,66,63,490 మందికి టీకాలు వేసినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు