ఒమన్‌లోని సలాలాలో ప్రారంభమైన హాకీ5 ఆసియా కప్ ముగిసింది. ఈ ఆసియన్ టోర్నీలో భారతీయ మహిళలు, పురుషుల జట్లు స్వర్ణ పతకాలను సాధించాయి. నిన్న (శనివారం) రాత్రి ఒమన్‌లోని సలాలాలో జరిగిన పురుషుల హాకీ 5 ఆసియా కప్ 2023లో ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌తో తలపడగా… పెనాల్టీ షూటౌట్లో పాక్ ను చిత్తుగా ఓడించింది.
ఫస్ట్ హాఫ్-టైమ్‌లో పాకిస్తాన్ 3-2తో ఆధిక్యంలో ఉంది, అయితే ఈ ఉత్కంట పోరులోని సెంకడ్ హాఫ్ లో కంమ్ బ్యాక్ ఇచ్చిన టీమిండియా స్కోరును 4-4 వద్ద సమం చేయగలిగారు. దీంతో టైటిల్‌ను షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఇక ఈ షూటౌట్ రౌండ్ ను అధిగమించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది భారత్. హాకీ5 ఆసియా కప్ భారత పురుషుల జట్టు స్వర్ణం సాదించడంతో.. పాకిస్తాన్ రజత పతకాన్ని గెలుచుకుంది.. ఒమన్ కాంస్యం సొంతం చేసుంది.
కాగా, గత నెల (ఆగస్ట్) 28నాడు జరిగిన మహిళల హాకీ5 ఆసియా కప్ ఫైనల్స్ లో భారత జట్టు థాయ్‌లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాదించింది. ఈ మ్యాచ్ లో 7-2 స్కోర్ తో థాయ్‌లాండ్ చిత్తుగా ఓడించింది. బంగారు పథకాన్ని కైవసం చేసుకంది. మహిళల విభాగంలో భారతదేశం గోల్డ్ దక్కించుకొవడంతో.. థాయిలాండ్ రజత పతక విజేతలుగా, మలేషియా కాంస్య పతక విజేతలుగా నిలిచాయి. కాగా, ఈ టోర్నీ లో టాప్ ట్రీ ఫినిషర్లు (పురుషులు, మహిళలు) FIH Hockey5s ప్రపంచ కప్ 2024లో స్థానం సొంతం చేసుకుంటారు.