Friday, November 22, 2024

హద్దు మీరుతున్న చైనా

1993లో కుదిరిన ఐదు ఒప్పందాల
ప్రకారం ఇరుదేశాలు సరిహద్దుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి. భారత్‌ ఈ ఒప్పందాలను ఆధారంగానే తన వాదాన్ని వినిపిస్తుండగా, చైనా మాత్రం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చు
కుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగమే కొత్త చట్టమని నిపుణులు పేర్కొంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జనజీవనానికి అనుమతిస్తూ కొత్త చట్టం లో అవకాశం కల్పించింది. ఈవిషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించక పోతే చైనా దూకుడు పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిమాలయాలపై కారుమబ్బులు కమ్ముకుంటు న్నాయి. చైనా భూ సరిహద్దుల్లో పరిస్థితులు భారత్‌ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అక్టోబర్‌ 19వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రూపా పట్టణంలో తూర్పు మండలం జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనర ల్‌ మనోజ్‌ పాండే విలేఖరులతో మాట్లాడుతూ, వాస్త వాధీన రేఖ పొడవునా చైనా తన దళాలను పెంచుకుం టూ పోతోందనీ, సైనిక విన్యాసాలు పెరిగిపోతున్నా యని అన్నారు. అదే సందర్భంలో భారత సైన్యం వాస్తవాధీనరేఖ వద్ద మరింత దూకుడుగా వ్యవహరిం చాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేశారు. సిక్కిం నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకూ సరిహద్దుల్లో గస్తీ బాధ్యత పూర్తిగా తూర్పు మండలం సైనికులదే. చైనా సైనికుల దూకుడును అరికట్టేందుకు భారత్‌ తగిన వ్యూహాలను సిద్ధం చేసిందనీ, వాస్తవాధీన రేఖ వద్ద ఎటువంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉందని జనరల్‌ పాండే స్పష్టం చేశారు. గడిచిన ఏడాదిన్నరగా చైనా కి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఏ)ని టిబెట్‌ సమీపంలో బాగా పెంచిందనీ, సైనిక విన్యాసాలను కూడా అధికం చేసిందని ఆయన అంగీకరించారు. పరిస్థితిని సీనియర్‌ కమాండింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలను సంద ర్శించి అంచనా వేస్తున్నారని జనరల్‌ పాండే చెప్పారు. సరిహద్దుల్లో చైనా మౌలిక సదుపాయాలను బాగా పెంచిందనీ, సరిహద్దుల నిర్వహణకు అవసరమైన చట్టబద్దమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతుం డగానే చైనా సరిహద్దుల్లో తమ వైపు భద్రతను మరింత పటిష్టం చేసిందని జనరల్‌ పాండే తెలియజేశారు. చైనాకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీయే కాకుండా, పీపుల్స్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సు (పిఎపి), పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో (పీఎస్‌బి)లు కూడా సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన చర్య లు తీసుకుంటాయని ఆయన వివరించారు. ఉగ్ర వాదులు, సరిహద్దులను దాటి అక్రమంగా ప్రవేశించే వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి ఉంటాయ ని తెలిపారు. సరిహద్దులను అక్రమంగా దాటే వారిపై ఆయుధాలను ప్రయోగించే అధికారం అక్కడి సాయుధ దళాలకు ఉందని చెప్పారు. సరిహద్దుల్లో అనుమతుల్లేకుండా డ్రోన్‌లు, విమానాలు తిరగరాద ని అన్నారు. పిఎల్‌ఏ, పిఎస్‌బి, పిఎపి దళాల మధ్య సమన్వయమే కాకుండా, రైల్వేలు, నీటి వనరుల శాఖ ల మధ్య, విదేశాంగ శాఖల మధ్య సమన్వయం ఉండే ట్టు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుందని జనరల్‌ పాండ్య తెలియజేశారు. ఇందుకు సంబంధించి చైనా కొత్త చట్టాన్ని తెచ్చింది. చైనా సరిహద్దుల్లో రోడ్లు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, నిఘా ,రక్షణ విమానాలు, వాహనాల కదలికలకు అవకాశాలు చైనా కల్పించింది. జాతీయ సరిహద్దులకు సమీపంలో ఎటువంటి శాశ్వత కట్టడాలను చేపట్టకుండా వ్యక్తులపై, సంస్థలపై నిషేధం విధించింది. ఆర్టికల్‌ 40లో ఇందుకు సంబం ధించి నిబంధనలను స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
చైనా 14 దేశాలతో భూ సరిహద్దులను పంచుకుం టోంది. వీటిలో ఎక్కువ భాగం భారత్‌లో చేరి ఉన్నవే. భారత్‌ సరిహద్దుల విషయంలో చైనా దళాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2014లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న సమయం లోనే 1500 మంది చైనా పీఎల్‌ఏ దళాలు లడఖ్‌లోని చూమార్‌ రంగంలో సరిహద్దులు దాటి భారత్‌ భూ భాగంలో ప్రవేశించాయి. ఒక వంక ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జిన్‌పింగ్‌ చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భారత్‌తో జిన్‌పింగ్‌ శాంతి కోసం చర్చలు జరుపుతున్న సమయంలోనే ఇలాంటి అసాధారణ సంఘటన చోటుచేసుకోవడం జిన్‌పింగ్‌ నే కాకుండా, చైనా సైనిక దళాలను ఇరకాటంలో పెట్టిం ది. జిన్‌పింగ్‌ బీజింగ్‌ తిరిగి వెళ్ళిన తర్వాత పిఎల్‌ఏ సైనికుల అధినేతను పిలిపించి దేశాధ్యక్షుడు జరిపే చర్చలకు అనుగుణంగానే పి ఎల్‌ఏ కదలికలు ఉండాల ని గట్టిగా హెచ్చరించారు. సైనిక కమాండర్లు అంతర్జా తీయ, స్వదేశీ భద్రతా వ్యవహారాలపై పూర్తి అవగాహ న కలిగి ఉండాలని కూడా ఆయన గట్టిగా సూచించా రు. చైనా తీసుకుని వచ్చిన కొత్త చట్టం వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానుంది. చైనా సరిహద్దు వివాదా లను దాదాపు అన్ని పొరుగుదేశాలతో పరిష్కరించు కుంది కానీ, భారత్‌, భూటాన్‌లతో మాత్రం అవి అలా గే ఉన్నాయి. కొన్ని భూభాగాలు తమవేనంటూ చైనా చేస్తున్న వాదనలను మన దేశం తిప్పికొడుతున్న సమయంలోనే చైనా కొత్త చట్టాన్ని తీసుకుని రావడం గమనార్హం. తమ పౌరులు అరుణాచల్‌ సరిహద్దు ప్రాంతాల్లో చాలాకాలంగా నివసిస్తున్నారనీ, వారు తమకు నివాస హక్కులు కావాలని డిమాండ్‌ చేస్తున్నా రంటూ చైనా చాలా లౌక్యంగా వాదిస్తోంది.అంటే భారత్‌ వాదాన్ని సెంటిమెంట్‌తో తిప్పికొట్టాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది.ఈ చట్టం ఆమోదం పొందడానికి ముందు నుంచి చౖౖెనా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో అంతర్భాగమైన తవాంగ్‌ తదితర ప్రాంతాలను తమవిగా వాదిస్తూ వస్తోంది. అక్కడ శాశ్వత నిర్మాణా లను ఇంతకుముందే చేపట్టింది.1993లో కుదిరిన ఐదు ఒప్పందాల ప్రకారం ఇరుదేశాలు సరిహద్దుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి. భారత్‌ ఈ ఒప్పందా లను ఆధారంగానే తన వాదాన్ని వినిపిస్తుండగా, చైనా మాత్రం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగమే కొత్త చట్టమని నిపుణులు పేర్కొంటున్నారు.సరిహద్దు ప్రాంతాల్లో జనజీవనానికి అనుమతిస్తూ కొత్త చట్టం లో అవకాశం కల్పించడం ద్వారా చైనా చాలా దూర దృష్టితోనే ముందుకు సాగుతోందన్నది నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో భారత్‌ మరింత స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకపోతే చైనా దూకుడు పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిబెట్‌ అటోనమస్‌ ప్రాంతం నాయకత్వాన్ని చైనా ఈ మద్యనే మార్చేసింది. అరుణాచల్‌ సమీపంలో శిబిరా లు, తాత్కాలిక కట్టడాలను అనుమతించ డంలో కీలక పాత్ర వహించిన చెదల్హాను ఆ పదవికి నియమించిం ది. భారత్‌తో ఇతర సరిహద్దులను కూడా పంచుకుం టున్న చైనా ఆ ప్రాంతాల్లో కూడా ఆక్రమణ ధోరణుల కు పాల్పడుతోంది. వీటన్నింటిని భారత్‌ పరిగణనలో కి తీసుకుని ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చు కుంటూ వెళ్ళాలన్నది నిపుణుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement