Tuesday, November 26, 2024

ఇండియా​–చైనా మధ్య ఫలించిన చర్చలు..!

వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిగా బలగాల ఉప సంహరణపై భారత్–చైనా మధ్య జరుగుతున్న ఏడో రౌండ్ దౌత్య చర్చలు ఎట్టకేలకు సత్ఫలితాలను ఇచ్చాయి. మాస్కో ఒప్పందానికి కట్టుబడేలా అంగీకారం కుదిరిందని భారత వర్గాలు చెబుతున్నాయి. పరస్పర ఆమోదం వచ్చే పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు నిర్ణయించామని పేర్కొంది. అయితే, ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు సమస్యలు దెబ్బ తీయకూడదని చైనాకు భారత్ తేల్చి చెప్పింది.

ఇప్పటికే పాంగోంగ్ సరస్సు వద్ద నుంచి ఇరు దేశాలకు చెందిన సైనికులు వెనక్కు వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ  పశ్చిమ సెక్టార్ వద్ద పరిస్థితిని సమీక్షించినట్టు భారత వర్గాలు చెబుతున్నాయి. సార్క్ సదస్సులో భాగంగా రష్యా రాజధాని మాస్కోలో భేటీ అయినప్పుడు జరిగిన ఐదు పాయింట్ల ఒడంబడికను అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. పాంగోంగ్ సరస్సు వద్ద మోహరించిన బలగాలు వెనక్కి వచ్చేయడంతో మిగిలిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని అంటున్నాయి. 11వ రౌండ్ సీనియర్ కమాండర్ స్థాయి చర్చలకు ఓకే చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. త్వరలోనే చర్చలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement