Friday, November 22, 2024

హెల్త్‌ కేర్‌ లో ఇండియా భేష్ .. దావోస్‌ వేదికపై ప్రశంసలు

ప్రపంచదేశాల్లోనే ఆరోగ్యరంగంలో క్యూబా అగ్రస్థానంలో ఉంది. చిన్న దేశమైనా, కరోనా మహమ్మారిని అరికట్టిన వైనం ప్రపంచదేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్యరంగంలో టాప్‌లో ఉన్న క్యూబా ఇప్పుడు ఇండియాపై ప్రశంసలు కురిపించింది. వైద్యారోగ్య రంగంలో ఇండియా సాధిస్తున్న ప్రగతి, ఆరోగ్యం రంగంలో చేస్తున్న అద్బుత కృషి, సాధిస్తున్న ఫలితాలు ఆశ్చర్య పరుస్తున్నాయని క్యూబా ఆరోగ్యశాఖ మంత్రి జోస్‌ ఏంజెల్‌ పోర్టల్‌ మిరాండా ప్రశంసించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఇండియా హెల్త్‌ మినిస్టర్ మాన్‌సుఖ్‌మాండవియా, క్యూబా మంత్రి జోస్‌ ఏంజెల్‌ పోర్టల్‌ మిరాండాలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిరాండా, ఆరోగ్యరంగంలో భారత్‌ సాధిస్తున్న గణనీయమైన ప్రగతిని ప్రశంసించారు.

రెండు దేశాల మంత్రుల మధ్య ఫార్మా రీసెర్చ్‌ మరియు మాన్యుఫాక్చరింగ్‌ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఫార్మా రీసెర్చ్‌ మరియు మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో కలిసి సంయుక్తంగా పని చేయాలని ఇరుదేశాల మంత్రులూ నిర్ణయించారు.హెల్త్‌ కేర్‌ రంగంలో ఇండియా ప్రవేశపెడుతున్న నూతన ఆవిష్కరణలను క్యూబా మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే అంశంపై కూడా ఇరుదేశాల మంత్రులు చర్చించారు. క్యూబా ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా దావోస్‌ సదస్సులోనే కాకుండా ఈనెల 23న జెనీవాలో జరిగిన వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లి సదస్సులో సైతం వైద్యారోగ్య రంగంలో ఇండియా సాధించిన ప్రగతిని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆరోగ్యభద్రతకు ఇండియా కట్టుబడి ఉందని మాండవియా పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement