కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రద్దయిన బస్సు సర్వీసులు రెండేళ్ల తర్వాత పున: ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ధాకా నుంచి శుక్రవారం వేకువజామున బస్సు ప్రారంభమై పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా చేరుకుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి బస్సు సర్వీసు పునరుద్దరణ ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ రోడ్డు రవాణా కార్పొరేషన్ ప్రతిరోజు రెండు దేశాల మధ్య బస్సురాకపోకలు కొనసాగిస్తుందని చెప్పారు. గత మే 29 నుంచి రైలు సర్వీసులు పునరుద్దరణ జరిగిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.