దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న భారత్ బంద్‌కు అఖిల భారత వెనకబడిన తరగతులు, మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ కోసం చట్టం రూపకల్పన, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌ను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..