- ఖోఖో లో భారత్ హవా.. కప్ కొట్టిన మెన్స్
ఖోఖో ప్రపంచకప్ 2025లో ఆతిథ్య భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పటికే భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా… తాజాగా భారత పురుషుల జట్టు కూడా వరల్డ్ కన్ నెగ్గి విజయ కేతనం ఎగురవేసింది.
నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్ తో తలపడిన భారత పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నీ అంతా అప్రతిహత విజయాలతో అదరగొట్టిన భారత మహిళలు, పురుషుల జట్లు తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాయి.