మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుతం లోకల్ మ్యానుఫాక్చరింగ్ రంగానికి రాయితీలు కల్పిస్తున్నది. పీఎల్‌ఐ స్కీంలో భాగంగా.. చిన్న చిన్న కంపెనీలను ఆర్థికంగా ఆదుకుంటున్నది. 2020, ఏప్రిల్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్‌తో పాటు ఐటీ హార్డ్‌వేర్‌లు స్థానికంగా రూపొందిస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే.. ఉత్పత్తిలో వృద్ధి సాధించారు. అదేవిధంగా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత శాఖ తెలిపిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2020-21 మధ్య కాలంలో.. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతిలో 104 శాతం వృద్ధి సాధించింది. ఇదే కాలంలో ఈ వస్తువుల తయారీ.. 74.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2016-17లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్ గూడ్స్ విలువ రూ.39,980 కోట్లు ఉంటే.. 2020-21 నాటికి.. 104 శాతం పెరిగి.. రూ.81,948 కోట్లకు చేరుకుంది. 2016-17లో భారత్ రూ.3,17,331 కోట్లు విలువ చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్‌ను ఉత్పత్తి చేసింది. అదే 2020-21 నాటికి 74.4 శాతం పెరిగి.. రూ.5,54,461 కోట్లకు చేరుకుంది.
కరోనా సవాళ్లను అధిగమించి..
కరోనా వైరస్ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కొద్ది రోజుల తరువాత.. 2020, ఏప్రిల్ 1న ప్రభుతం పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ కోసం పీఎల్‌ఐ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీంలో భాగంగా.. భారత్‌లో తయారు చేయబడిన మొబైల్ ఫోన్‌లు, నిర్దేశిత ఎలక్ట్రానిక్ విడి భాగాల్లో పెరుగుతున్న అమ్మకాలపై అర్హత కలిగిన కంపెనీలకు 6 శాతం నుంచి 4 శాతం వరకు ప్రోత్సాహం అందించబడుతుంది. 32 కంపెనీలు ఈ స్కీం కింద రాయితీలు పొందుతున్నాయి. 2021, మార్చి 3న ఐటీ హార్డ్‌వేర్ కోసం మరో సరికొత్త పీఎల్‌ఐ స్కీంను లాంచ్ చేసింది. ఇందులో 4 శాతం, 2 శాతం, 1 శాతం ఇన్సెంటీవ్‌లు అర్హత గల కంపెనీలకు అందిస్తాయి. 2019-20ను బేస్ ఇయర్‌గా తీసుకున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సర్వర్లు వంటి కీలక ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి కోసం ఈ ప్రోత్సాహకం నాలుగు సంవత్సరాల పాటు ఇవబడుతుంది. ఈ పీఎల్‌ఐ స్కీం కింద 14 కంపెనీలు లబ్ది పొందుతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ పాలసీలో భాగంగా ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా.. ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను తయారు చేస్తుంది.
ఎలక్ట్రానిక్ గూడ్స్ హబ్‌గా భారత్, భారీగా వస్తువుల ఎగుమతులు
Advertisement
తాజా వార్తలు
Advertisement