భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిన్న భారీగా మత్తు పదర్థాలను స్వాధీనం చేసుకుంది ఇండియన్ ఆర్మి. పైపుల ద్వారా భారత్‌లోకి పాక్ స్మగ్లర్లు పంపిస్తున్న రూ. 270 కోట్ల విలువైన హెరాయిన్‌ను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. బికనేర్‌లోని కాజూవాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పంపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ బలగాలు వెంటనే స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కిలోల బరువున్న హెరాయిన్‌ను లభ్యమైంది. దీని విలువ రూ. 270 కోట్ల వరకు ఉంటుదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దమొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement