ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు పెద్ద ఎత్తున వ్యూయర్‌షిప్ వస్తోంది. గత మూడేళ్లలో టీమిండియా ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లలో అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సిరీస్‌కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ వెల్లడించింది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. 2018లో ఈ టీమ్స్ మధ్యే జరిగిన సిరీస్ కంటే ఇప్పుడు సగటు వ్యూయర్‌షిప్ 30 శాతం పెరిగినట్లు సోనీ స్పోర్ట్స్ తెలిపింది. ఇండియా, ఇంగ్లండ్ రెండో టెస్ట్ చివరి రోజు ఆటకు సగటు రేటింగ్స్ 70 శాతం వరకూ పెరిగాయి.
భారత్ గెలుస్తుందన్న అంచనాతో ఆ రోజు క్రికెట్ అభిమానులు భారీగా మ్యాచ్‌ను చూశారు. సుమారు 80 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇండియన్ టీమ్ విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వచ్చిన అత్యధిక ఇంప్రెషన్స్ ఇవే. ఆ రోజు చివరి సెషన్‌లో ఇంగ్లండ్ 120 పరుగులకే ఆలౌటైన సందర్భంలో కోటి 7 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి అని సోనీ స్పోర్ట్స్ చెప్పింది. లార్డ్స్ టెస్ట్‌లో ఇండియా గెలిచిన తర్వాత సోనీ చానెల్‌కు మరిన్ని బ్రాండ్లు క్యూ కట్టడం విశేషం. ఇప్పటికే ఈ సిరీస్‌కు 12 బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉన్నాయి.
ఈ వార్త కూడా చదవండి: క్రికెట్లో తొలిసారి స్మార్ట్ బాల్ ప్రయోగం