భారత్- అమెరికా మధ్య కీలక సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఎర్ర సముద్రంలో సవాలుగా మారతున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ వేదికగా (‘X’) ఇలా వ్రాశాడు. నా స్నేహితుడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్‌తో నేను సంభాషణ చేసాను.. మా చర్చలు ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లపై దృష్టి సారించాం.. గాజాతో సహా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించామని పేర్కొన్నారు. కాగా, అలాగే, జైశంకర్ తో ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు.
అయితే, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జె. బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌తో మాట్లాడారు.. ఈ సంభాషణలో, మంత్రులిద్దరూ దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.. దీంతో పాటు భవిష్యత్తులో ఈ దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు అని పేర్కొన్నారు.
ఇక, ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు వాణిజ్య షిప్పింగ్ పై దాడులు చేయడంతో అమాయకమైన నావికులకు ప్రమాదంలో పడుతున్నారు. అలాగే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మిల్లర్ చెప్పారు. ఎర్ర సముద్రం అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసే ప్రధాన వాణిజ్య కారిడార్ అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నొక్కిచెప్పినట్లు ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంతంలో నావిగేషన్ స్వేచ్ఛను పరిరక్షించడానికి భారతదేశంతో సహకారాన్ని పెంచడాన్ని వారు స్వాగతించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం తీవ్రతరం కాకుండా నిరోధించే ప్రయత్నాలపై.. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించడంపై కూడా రెండు దేశాలకు చెందిన ఇద్దరు మంత్రులు చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దూకుడు యుద్ధంపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రస్తావించారు.