Friday, November 22, 2024

Delhi: నేడు ఇండియా కూటమి నేతల సమావేశం

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. 199 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది.

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, చంపయ్‌ సోరెన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేష్‌ యాదవ్‌, సీతారాం ఏచూరి, డి.రాజా ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించటంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం పాత మిత్రులైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌ను సంప్రదించాలా వద్దా అనే విషయమై చర్చించనున్నట్లు తెలిసింది. తెలుగుదేశం, జేడీయూలు ఇప్పటికే ఇండియా కూటమిలో చేరికను తోసిపుచ్చాయి. ఎన్డీయేలోనే కొనసాగుతామని పేర్కొన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement