న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా రెండో రోజు 325 పరుగులకు ఆలవుట్ అయ్యింది. ఇందులో మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేసి భేష్ అనిపించుకున్నాడు. అక్షర్ పటేల్ 52, శుభ్‌మన్ గిల్ 44 పరుగులు చేశారు. పుజారా, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యారు. దీంతో అనుకున్న స్థాయిలో ఇండియా బ్యాటింగ్ ఆకట్టుకోలేదు.
80 పరుగుల వద్ద గిల్ వికెట్ పడగా.. ఆ తర్వాత రెండో ఓవర్లకే పుజారా డకౌట్ అయ్యాడు. కాగా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. రెండు ఓవర్లు క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఎటువంటి పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు.
ఇక.. 160 స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా అయ్యర్, 224 పరుగుల వద్ద సాహా, ఆ వెంటనే వచ్చిన అశ్విన్ కూడా అదే ఓవర్లో డకౌట్ అయ్యి.. పెవిలియన్‌కు క్యూ కట్టాడు. తర్వాత కాస్త నిదానంగా సాగిన భారత బ్యాటింగ్‌లో 291 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్, 316 స్కోర్ వద్ద అక్షర్ పటేల్ అవుటయ్యాడు.