వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 170 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆ టీమ్ ముందు కేవలం 139 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఉంచింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతోపాటు కేన్ విలియమ్సన్ అద్భుతమైన కెప్టెన్సీ ముందు భారత బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. టాప్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. రిషబ్ పంత్ మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతడు కూడా కీలకమైన సమయంలో చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీసన్ 2, వాగ్నర్ 1 వికెట్ తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement