అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) ఉమెన్స్ హాకీ 5s వరల్డ్ కప్ ఉమెన్ 2024 ప్రారంభ మ్యాచ్ & పూల్స్ షెడ్యూల్‌ను ఇవ్వాల (ఆదివారం) ప్రకటించింది. ఈ టోర్నీలో 16 దేశాలు నాలుగు గ్రూపులుగా విబజించారు. అమెరికా, పోలాండ్ & నమీబియాతో కూడిన పూల్ Cలో భారత్ స్థానం పొందింది. పూల్ Aలోని హోస్ట్ కంట్రీ ఒమన్ తో పాటు మలేషియా, ఫిజీ, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇక పూల్ B లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా ఉండగా.. పూల్ D లో న్యూజిలాండ్, ఉరుగ్వే, థాయిలాండ్, పరాగ్వే జట్లు ఉన్నాయి. భారత మహిళల జట్టు హాకీ5 ఆసియ కప్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌ను 7-2తో ఓడించి ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
మెన్స్ పూల్..
ఇక పురుషుల పోటీలో భారత్ తో పాటు ఈజిప్ట్, స్విట్జర్లాండ్, జమైకా దేశాల జట్లు పూల్ Bలో పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్ తోపాటు పాకిస్థాన్, పోలాండ్, నైజీరియా పూల్ Aలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా పూల్ Cలో ఉండగా, ఆతిథ్య ఒమన్ తో పాటు పూల్ D లో మలేషియా, యునైటెడ్ స్టేట్స్, ఫిజీ జట్లు ఉన్నాయి.
2024 జనవరి 24 నుండి 31 వరకు ఒమన్‌లోని మస్కట్‌లో జరగనున్న FIH హాకీ 5 ప్రపంచ కప్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16 పురుషులు, 16 మహిళల జట్లు పోటీపడనున్నాయి.