Friday, November 22, 2024

ఆర్చరీ వరల్డ్‌కప్‌లో స్వర్ణంపై భారత్‌ గురి

ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. మెన్స్‌ రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత స్వర్ణపతకం వేటకు చేరువైంది. స్టేజ్‌ 1లో గురువారం మూడు విజయాలు నమోదు చేసింది. ఆదివారం చైనాతో ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచే అవకాశం దక్కించుకుంది. అటాను దాస్‌, బి ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ల త్రయం ఎల్లుండి చైనా ప్లేయర్లతో ఆడనుంది. 4వ సీడ్‌గా అర్హత పొందిన భారత పురుషుల బృందం తొలిరౌండ్‌ 13వసీడ్‌ జపాన్‌ టీమ్‌పై 5-4తో నెగ్గింది.

యాదృచ్చికంగా, భారత జట్టు అంట్యాలలోని మెడిటెర్రనీన్‌ కోస్టల్‌ రిసార్ట్‌లోనే మరోసారి స్వర్ణపతకంపై గురిపెట్టింది. 2008లో జయంత టాలుదార్‌, రాహుల్‌ బెనర్జీ, మంగల్‌సింగ్‌ చాంపియా సంచలన విజయం నమోదుచేశారు. మలేషియా బృందంపై 218-215 తేడాతో గెలిచి ప్రపంచకప్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చివరిసారిగా భారత రికర్వు టీమ్‌ 2010లో షాంఘై ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గింది. 2014లో స్టేజ్‌-2 మెడెలిన్‌, స్టేజ్‌-4 వ్రోక్లావ్‌ ఈవెంట్లలో ఫైనల్స్‌కు చేరినప్పటికీ, రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement