మెన్స్ ఆసియన్ హాకీ 5ఎస్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు.. తమ ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 15-1 తేడాతో ఘన విజయం సాదించింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్ లోనూ 12-2 స్కోర్ తో ఆతిథ్య జట్టు ఓమన్ ని చిత్తుగా ఓడించింది. అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో4-5 తేడాతో ఒటమిపాలైంది.. ఇక, ఈ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో మొదటి నుంచి ఫుల్ జోష్ లో ఆడుతున్న భారత్ ఇవ్వాల (గురువారం) జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఈవెంట్ లో ఇవ్వాల జరిగిన మ్యాచ్ లో మలేషియాతో పోటీ పడగా.. 7-3 స్కోర్ తో విజయం సొంతం చేసుకుంది.
అయితే.. ఈ మ్యాచ్ లో మొదటి అర్ధభాగం ముగిసేసరికి రెండు జట్లు 3-3 పాయింట్లతో స్కోర్ బోర్డులో సమానంగా నిలిచాయి.. ఇక సెకండాఫ్‌లో ఊపందుకున్న భారత్ నాలుగు గోల్స్ చేయగా.. మలేషియా జట్టుకు ఒక్క గోల్ కూడా చాన్స్ ఇవ్వలేదు. దీంతో ఇవ్వాల జరిగి మ్యాచ్ లో మలేషియాపై 7-3 స్కొర్ తేడాతో గెలిచి గేమ్ ని దక్కించుంది. కాగా, ఇవ్వాల రాత్రి 7.30 గంటలకు ఎలీట్ గ్రూప్ లో జపాన్‌లతో తలపడనుంది. కాగా, వచ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండగా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్రస్తుతం జరుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.