Thursday, September 19, 2024

Duleep Tropy | ప్రథమ్, తిలక్ శతకాల మోత!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-ఎ జ‌ట్టు దుమ్మురేపింది. అనంతపురం వేదికగా ఇండియా-డి టీమ్ తో జ‌రుగుత‌న్న మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. 115/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇండియా-ఏ జ‌ట్టు 380/3 కు మ్యాచ్ దిక్లేర్ చేసింది.

ఈ ఇన్నింగ్స్ లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ స్టార్ తిలక్ శర్మ శతకం సాధించాడు. 193 బంతుల్లో (111) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మకు ఇది ఐదో ఫస్ట్ క్లాస్ సెంచరీ. తిలక్ వర్మ‌తో పాటు శశ్వాత్ రావత్ (64 బ్యాటింగ్) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఇక అంత‌క‌ముందు ఓపెనర్ ప్రథమ్ సింగ్ (122)కూడా శతకం సాధించడంతో ఇండియా-ఏ భారీ ప‌రుగులు సాధించింది. 98 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-ఏ 3 వికెట్లకు 380 పరుగులు చేసి మ్యాచ్ డిక్లేయిర్ చేసింది. సౌరభ్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా… శ్రేయాస్ అయ్యర్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా డి పోరాడుతొంది. మూడో ఆట ముగిసేస‌రికి 62/1 చేసింది. ఖలీల్ అహ్మద్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు. కాగా, ఇండియా డి జ‌ట్టు విజ‌యం సాధించాలంటే 426 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఇక మిగిలింది ఒక్క రోజే !

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములాని(89), తనూష్ కొటియాన్(53)లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లు తీయగా.. కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ తీసారు.

- Advertisement -

అనంతరం ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 183 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(124 బంతుల్లో 15 ఫోర్లతో 92) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(3/39), ఆఖిబ్ ఖాన్(3/41) మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, తనూష్ కోటియన్, షామ్స్ ములాని తలో వికెట్ తీసారు. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ ఇండియా-ఏ ప్రస్తుతం 426 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement