జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్.. ఈరోజు జరిగిన నామమాత్రపు ఐదో టీ20 మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసిన టీమిండియా… డిఫెండింగ్‌లో అదరగొట్టింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో… జింబాబ్వే 125 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 42 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను గెలుపుతో ముగించింది.
జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో డియోన్ మైయర్స్ (34), తాడివానాసే మారుమణి (27), ఫరాజ్ అక్రమ్ (27) రాణించారు. మిగిలిన వారు 10 పరుగులలోపే పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. శివమ్ దూబే రెండు వికెట్లు తీయగా… తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా సమష్టిగా రాణించింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు అదరగొట్టారు. సిక్స్‌ల మోత మోగించిని సంజూ శాంసన్ (58) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక రియాన్ పరాగ్ (22), శివం దూబే (26) ఆకట్టుకున్నారు. ఆఖర్లో వచ్చిన రింకూ సింగ్ (11 నాటౌట్) ఉన్నాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.