Saturday, September 21, 2024

IND vs SL | భారత్ కుర్రాళ్లు అదుర్స్.. టీ20లో శుభారంభం..

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు శుభారంభం ద‌క్కింది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… శ్రీలంక ముందు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా, భారీ చేజింగ్ లో శ్రీలంక ఆలౌట్ అయ్యింది. దీంతో భార‌త జ‌ట్టు 43 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

అయితే, భారీ శ్రీలంక‌ ఓపెనర్లు దంచేశారు. భారత బౌలర్లను ఉతికి ఆరేస్తూ.. పాతుమ్ నిస్సాంక (79), కుసాల్ మెండిస్ (45) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. చెలరేగుతున్న ఈ జోడీకి అర్శదీప్ సింగ్ అడ్డుకట్ట వేశాడు. 9వ ఓవర్లో కుసాల్ మెండిస్ ను అవుట్ చేసి భార‌త్ కు బ్రేక్ ఇచ్చాడు.

- Advertisement -

అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరా(20)తో కలిసి పాతుమ్ నిశాంక మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ 15వ ఓవర్లో అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.

ఇక ఆ తరువాత శ్రీలంక జట్టు కోలుకోలేక పోయింది. వరుస వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది… క్రీజ్ లోకి వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్టుగానే పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. దీంతో 214 ప‌రుగుల భారీ చేధ‌న‌లో 19.2 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో రియాన్ పరాగ్ (3/5), అక్షర్ పటేల్ (2/38), అర్శదీప్ సింగ్ (2/24), రవి బిష్ణోయ్ (1/37), మహ్మద్ సిరాజ్ (1/23) వికెట్లు ద‌క్కించుకున్నారు.

ఇక అంత‌కముందు బ్చాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు బాదింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) అదిరే ఆరంభం అందించారు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య (58) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. అతనికి తోడు రిషబ్ పంత్ 49 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 213 పరుగులు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement