Monday, July 1, 2024

IND vs SA Test | ష‌ఫాలీ విధ్వంసం.. భార‌త్ రికార్డు స్కోర్

చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో శుక్రవారం మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టు రికార్డు స్కోర్ బాదింది. తొలుత బ్య‌టింగ్ చేప‌ట్టిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 525 పరుగులు చేసింది.

ఓపెనర్ షెఫాలీ వర్మ డబుల్ సెంచరీతో చరిత్రలో రికార్డులు తిరగరాస్తూ… సౌతాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేసింది. షెఫాలీ వర్మకి తోడుగా.. స్మృతి మంధాన (161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149) సెంచ‌రీతో చెల‌రేగింది. ఇక ఆత‌రువాత వ‌చ్చిన‌ జెమీమా రోడ్రిగ్స్ కూడా (55) హాఫ్ సెంచ‌రీతో మెరిసింది. దీంతో తొలిరోజు 500 పరుగులు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్ర‌త‌స్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బ్యాటింగ్), రిచా ఘోష్ (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement