జొహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడవ టీ20 మ్యాచ్ లో భాగంగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రాకా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, మరికొద్ది సేపట్లో టీమిండియా బ్యాటింగ్ చేపట్టనుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన సఫారీలు సొంతగడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
కాగా, సౌతాఫ్రికా వేదిక జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.. వాన ప్రభావం చూపిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.
ఇండియా : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), రింకు సింగ్, జితేష్ శర్మ (WK), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (వారం), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, ఆండిల్ ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ, నాండ్రే బర్గర్, కేశవ్ మహరాజ్