Thursday, October 17, 2024

IND vs SA | స‌ఫారీల‌ను వణికించిన భార‌త‌ బౌలర్లు.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచకప్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) భారత్‌ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో… టీమిండియా నిర్దేశించిన 327 పరుగుల టార్గెట్ తో భరిలోకి దిగిన సఫారీల జట్టు 28 ఓవర్లలోనే కుప్పకూలింది. దీంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక, చేజింగ్‌లో సఫారీలు ఆదిలోనే చతిక‌ల‌పడ్డారు. 13 ఓవర్ల లోపే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. మహ్మద్‌ సిరాజ్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలుపెట్టగా… జడేజా, షమీలు సౌతాఫ్రికాకు వరుస షాకులిచ్చి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఇక దీంతో 28 ఓవర్ల లోపే 83 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. ఇందులో జడేజా 5 వికెట్లతో చెలరేగా.. మహ్మద్‌ సిరాజ్ 1, షమీలు 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement