కోల్‌కతా: ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా అజేయంగానే సెమీస్‌కు చేరుతుందా? అగ్రస్థానంతోనే లీగ్ దశను ముగిస్తుందా? అనే ప్రశ్నలకు నేటి మ్యాచ్‌తో సమాధానం లభించనుంది. టోర్నీలో తన తర్వాత ఉత్తమ ప్రదర్శన చేస్తున్న దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోబోతోంది. వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత్ ఏమార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా.. సఫారీ జట్టులో గెరాల్డ్ కోయెట్జ్ స్థానంలో స్పిన్నర్ షంసీని తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement