సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈరోజు జరిగిన మూడో మ్యాచ్‌లో స్వల్ప టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు… 40 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించి 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా వొల్వార్డ్త్ (61), తజ్మిన్ బ్రిట్స్(38)లు రాణించారు. అయితే భారత బౌలర్ల ధాటికి 215 పరుగులకే పరిమితమైంది. అనంతరం స్వల్ఫ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను టీమిండియా ఉతికి ఆరేసింది.
హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ స్మృతి మంధాన… మరోసారి సెంచరీ దిశగా దూసుకెళ్లి (90) పరుగుల వద్ద ఔటైంది. షఫాలీ వర్మ (25), ప్రియా పునియా (28), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42) రాణించారు. జెమీమా రోడ్రిగ్స్ (19 నాటౌట్) నిలకడగా ఆడగా.. చివర్లో వచ్చిన ఆల్ రౌండర్ రిచా ఘోష్ (6 నాటౌట్) ఫినిషింగ్ టచ్ తో మ్యాచ్ ను ముగించింది.