Tuesday, November 19, 2024

IND vs SA | వరుణుడు కరుణించేనా..! రేపే రెండో టీ20

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు (మంగళవారం) రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. డర్బన్‌ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్‌.. ఎడతెరిపి వాణ కురవడంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దయిపోయింది. అయితే ఇప్పుడు సెయింట్‌ జార్జ్‌ వేదికగా జరగాల్సిన రెండో టీ20కి కూడా వర్షపు ముప్పుందని అక్కడి వాతావారణ శాఖ పేర్కొంది. దీంతో మరోసారి క్రికెట్‌ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కొన్ని ఓవర్ల ఆటైనా సాధ్యపడాలని అందరూ కోరుకుంటున్నారు.

ఉత్సాహంతో యువ ఆటగాళ్లు..

- Advertisement -

ఇటీవల భారత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న టీమిండియా యువ క్రికెటర్లు ఇప్పుడు సఫారీల సమరానికి సిద్ధమై వచ్చారు. ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై కూడా తమ ప్రతపాన్ని చూయిస్తామనే ధీమాతో ఉన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, షమీ వంటి సీనియర్ల గైర్హాజరీలో టీమిండియాకు సూర్యకుమార్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌ సారథిగా ఆసీస్‌ సిరీస్‌ను గెలిపించిన సూర్య ఇప్పుడు ప్రొటిస్ట్‌ సిరీస్‌పై కన్నేశాడు.

ప్రస్తుత భారత జట్టులోని యువ ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ సమరాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారు. భారత సెలక్టర్ల దృష్టిలో పడి మెగా టోర్నీకి జాక్‌పాట్‌ కొట్టాలని వారు ఆశతో ఉన్నారు. ఇక ప్రపంచకప్‌ తర్వాత ఆసీస్‌ సిరీస్‌లో విశ్రాంతిలో ఉన్న శుభ్‌మాన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, సిరాజ్‌, కుల్దిప్‌ యాదవ్‌లు తిరిగి భారత జట్టులో చేరారు.

వీరి రాకతో టీమిండియా మరింతగా పటిష్టమైంది. ఇక దక్షిణాఫ్రిక పిచ్‌లు పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తాయి. ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై పరుగులు సాధించడం టీమిండియా యువ బ్యాటర్లకు పెద్ద సవాల్‌ అని చెప్పడంలో సందేహంలేదు. ఇప్పటివరకు దూకుడుగా ఆడిన యువ బ్యాటర్లు సఫారీ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్‌ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా రావడం ఖాయమనిపిస్తోంది.

గిల్‌ రాకతో రుతురాజ్‌ అవకాశం కోల్పోయాడు. మూడో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, నాలుగో స్థానంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి వస్తాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌ బ్యాటింగ్‌కు దిగే చాన్స్‌ ఉంది. ఆసీస్‌ సిరీస్‌లో రింకూ సింగ్‌ అద్భుత ఫినీషియర్‌గా పేరు సంపాదించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ లేదా జితేష్‌ శర్మలో ఎవరికీ అవకాశం లభిస్తుందో చూడాలి.

తర్వాత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో టీమిండియా కీలక ఆటగాడిగా మరే అవకాశం ఉంది. బౌలింగ్‌ విషయానికి వస్తే పేసర్లు సిరాజ్‌, ముకేశ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లతో ఈ విభాగం కడా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరికీ అవకాశం లభించిన సత్తా చాటడం ఖాయం. స్పిన్‌లో జడేజాతో పాటు రవి బిష్ణోయ్‌ జత కట్టే చాన్స్‌ కనిపిస్తోంది. ఓవరాల్‌గా భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.

విధ్వంసకర ఆటగాళ్లతో సఫారీ టీమ్‌..

టీ20లో సఫారీ జట్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి, విధ్వంసకర ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు సొంతం. ఇక వారి సొంత మైదానాల్లో ఈ సిరీస్‌ జరగనుండటం సఫారీ జట్టుకు మరింతా కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌, కెప్టెన్‌ మార్క్‌రమ్‌, హెన్రీచ్‌ క్లాసెన్‌, హెండ్రిక్స్‌, స్టబ్స్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు ఉన్నారు. వీరు బ్యాట్‌ ఝూళిపిస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. మార్కొ జాన్సన్‌, ఫెలుకవయో, కొయెట్జీ, ఫెరీరాలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంటే.. కేశవ్‌ మహరాజ్‌, తబ్రేజ్‌ షంసీ, బర్గర్‌లతో స్పిన్‌ విభాగం కూడా సంచలనాలు నమోదు చేయగలదు. మొత్తం సఫారీ జట్టు కూడా టీమిండియాకు గట్టి సవాల్‌ విసిరేందు రెడీగా ఉంది.

జట్ల వివరాలు (అంచనా):

భారత్‌: యశస్వి జైస్వాల్‌, శుభ్‌మాన్‌ గిల్‌/రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌)/ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంత్ర జడేజా, దీపక్‌ చాహర్‌/మకేశ్‌ కుమార్‌, కుల్దిప్‌ యాదవ్‌/రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్‌, మాథ్యూ బ్రిజ్కె, అయిడన్‌ మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), హెండ్రిక్స్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌)/ట్రిస్టన్‌ స్టబ్స్‌ (వికెట్‌ కీపర్‌), డేవివ్‌ మిల్లర్‌, డెనొవన్‌ ఫెరీరా, మార్కొ జాన్సన్‌/ఆండిలె, కేశవ్‌ మహరాజ్‌, గెర్లాడ్‌ కొయెట్జీ, నాంద్రె బర్గర్‌, తబ్రేజ్‌ షంసీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement