మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 : 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 8 ఏండ్లుగా మూడంకెల స్కోర్ కోసం నిరీక్షిస్తున్న శాంసన్ దక్షిణాఫ్రికా గడ్డపై తన కలను నిజం చేసుకోగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(52 : 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు.
చివర్లో రింకూ సింగ్(38) వీరవిహారం చేయడంలో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు…