వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకువెలుతోంది టీమ్ఇండియా. రేపు (ఆదివారం) న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక పోరుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు దర్శశాలలో నెట్ ప్రాక్టీస్ లో సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో అతడు ప్రాక్టీస్‌ను అర్థాంతరంగా ముగించాడు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు సూర్యను ఆస్పత్రికి పంపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయితే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆడడం కష్టమే. ఇక మరో వైపు టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడి తల భాగంలో తేనటీగ కుట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా మైదానాన్ని విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement