భారత్ – న్యూజిలాండ్ మధ్య పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ లోనూ టామ్ లాథమ్ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన కివీస్… రెండో ఇన్నింగ్స్ లో 198/5 పరుగులు చేసి భారత్ పై 301 పరుగుల లీడ్ సాధించింది.
కాగా, ఓవర్ నైట్ స్కోరు 16/1తో ఈరోజు రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా… న్యూజిలాండ్ స్పిన్ ధాటికి చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ లో 45.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. భారత్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా (38), యశస్వి జైస్వాల్ (30), శుభమన్ గిల్ (30) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 7 వికెట్లతో చెలరేగాడు.
ఇక, 106 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్… రెండో రోజు ఆట ముగిసేసరికి 198/5 పరుగులు సాధించి.. టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. దీంతో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 301 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ (86) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో టామ్ బ్లండెల్ (30), గ్లెన్ ఫిలిప్స్ (9) ఉన్నారు. కాగా, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో మరో సారి అదరగొట్టాడు.
మొదటి రోజు :
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ – 79.1 ఓవర్లలో 259/10
భారత్ – 11.0 ఓవర్లలో 16/1
రెండో రోజు :
భారత్ తొలి ఇన్నింగ్స్ – 45.3 ఓవర్లలో 156/10
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ – 53.0 ఓవర్లలో 198/5 (లీడ్ 301)