తొలి రోజు వర్షార్పణమైన భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభమైంది. టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది..
గిల్ కు రెస్ట్ – సర్ఫరాజ్ ఇన్
వన్‌డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. మూడో పేసర్ ఆకాశ్ దీప్‌ను కాదని కుల్‌దీప్ యాదవ్‌ను మేనేజ్‌మెంట్ తీసుకుంది. గిల్ వందశాతం ఫిట్‌గా లేకపోవడంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు.
తుది జట్లుభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ