భారీ వర్షం కారణంగా హామిల్టన్ లో ఆదివారం జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ రద్దయ్యింది. 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టీమిండియా 12.5 ఓవర్లలో 89/1 స్కోరు చేసింది. ఇదే సమయంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఎంతకీ వర్షం తగ్గడం లేదు.. ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ లో 1-0లో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈ నెల 30న జరగనుంది. అప్పుడైనా వరుణుడు కనుకరిస్తాడో లేదో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement