బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో భారత్ అనూహ్యంగా ఫాలో ఆన్ గండం నుంచి బయట పడింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ చేసినప్పటికీ కివీస్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగలిగింది. టీమిండియా ఓటమి నుంచి బయట పడాలంటే ఇక భారమంతా వరుణిడి మీదే ఆధార పడి ఉంది.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగింది. ఓవర్ నైట్ 231/3 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా అసాధారణ బ్యాటింగ్ తో 462 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, సర్ఫరాజ్ ఖాన్ (150) భారీ సెంచరీ, రిషబ్ పంత్ (99) విధ్వంసకర బ్యాటింగ్ తో కోలుకున్న టీమ్ ఇండియా చివరి సెషన్ లో అలౌటయ్యింది.
కేవలం 57 పరుగులకే భారత జట్టు చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. దీంతో రోహిత్ సేన… కివీస్ పై 107 పరుగుల ఆధిక్యం సాధించింది. కాగా, న్యూజిలాండ్ పేసర్లు విలియం విలియం ఒరూర్కే, మాట్ హెన్రీ మూడేసి వికెట్లు తీశారు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా… టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు.
ఇక 107 టార్గెట్ తో న్యూజిలాండ్ ఛేజింగ్ ప్రారంభించగా… కివీస్ ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగుసే సరికి 0 పరుగులు నమోదు చేసింది. అయితే, రేపటి మ్యాచ్ లో కివీస్ స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగనుండగా…. రేపు ఆఖరి రోజు కావడంతో న్యూజిలాండ్ ఆచితూచి ఆడే అవకాశం ఉంది. టీమిండియా గెలవాలంటే బౌలర్లు స్పిన్ త్రయంతో నిప్పులు చెరిగితే సంచలన విజయాన్ని అందుకోవచ్చు.