Monday, November 25, 2024

IND vs ENG | హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. టాస్ డిలే !

టీ20 ప్రపంచకప్‌లో హై వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం క‌లిగించింది. గయానా వేదికగా ఇవ్వాల భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్‌లో భారత్‌ 7:30కి టాస్‌ వేయాల్సి ఉండగా…. వర్షం కారణంగా ఆలస్యమైంది. దీంతో మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో మరికొద్ది సేపట్లో మైదానాన్ని పరిశీలించి మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ప్రకటిస్తారు. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

అయితే, ఈ మ్యాచ్‌కు రిజ‌ర్వ్ డే లేదు. కేవ‌లం 250 నిమిషాల అద‌న‌పు స‌మ‌యాన్ని కేటాయించారు. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తితో విజేత‌ను నిర్ణ‌యించాలి అన్నా ఇరు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున మ్యాచ్ ఆడాల్సి ఉంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అర్ధరాత్రి 12.10 గంటల వరకు ప్రారంభం కాకపోయినా ఎలాంటి న‌ష్టం లేదు.

12.10లోపు ఎప్పుడు ప్రారంభ‌మైనా స‌రే ఎలాంటి ఓవ‌ర్ల కోతా లేకుండా 20 ఓవర్ల పాటు మ్యాచ్‌ను కొన‌సాగ‌నుంది. 12.10 త‌రువాత ఓవ‌ర్ల కోత మొద‌లు కానుంది. 1.44 వ‌ర‌కు కూడా మ్యాచ్ మొద‌లు కాక‌పోతే ర‌ద్దు చేస్తారు. ఆ స‌మాయానికి మ్యాచ్ నిర్వ‌హించే అనుకూల ప‌రిస్థితులు ఉంటే 10 ఓవ‌ర్ల ఆట జ‌ర‌గే చాన్స్ ఉంటుంది…

ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మ్యాచ్ ర‌ద్దు అయితే.. భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ ఇంటి ముఖం ప‌ట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సూప‌ర్ 8 ద‌శ‌లో త‌న గ్రూపులో భారత్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా గ్రూపు-బిలో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. మెరుగైన స్థానంలో నిలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరే అవకాశం ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement