టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అజేయంగా దూసుకుపోతుంది. సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 196 పరుగులు బాదింది. అనంతరం భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితం చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.
భారత్ నిర్ధేశించిన భారీ చేధనలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషద్ హొస్సేన్ (24)తో పరువాలేదనిపించాడు. మిగిలినవారు భారత్ బౌలర్ల ధాటికి దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ధనాధన్ ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ(37), రిషభ్ పంత్(36)లు తో రాణించారు. శివం దూబే(34), కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖర్లో హార్దిక్ పాండ్యా(50 నాటౌట్)లు సిక్సర్లతో మోతమోగించాడు. దాంతో, టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.