హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల వరద పారింది. క్రికెట్ అభిమానుల కేరింతల నడుమ బంతులు బౌండరీలను దాటేశాయి. శనివారం జరిగిన భారత్, బంగ్లా మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. దసరా సంబురాలకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు ప్రారంభం నుంచే దూకుడు చూపింది. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మంచి ప్రారంభం ఇచ్చారు. అయితే.. అభిషేక్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి క్యాచ్ అవుట్ కావడంతో కెప్టెన్ సూర్యా క్రీజ్‌లోకి వచ్చాడు. ఇక.. అప్పటి నుంచి స్టేడియంలో పరుగుల వరద పారిందనే చెప్పుకోవాలి.
అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు.. ఈ క్రమంలో సంజూ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 47 బంతుల్లో 111 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత పరాగ్ జతకాగా, సూర్య కుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రంగంలోకి దిగిన హార్దిక్, రియాన్ పరాగ్ అదే ఒరవడి కొనసాగిస్తూ పరుగుల సునామీ సృష్టించారు. 18వ ఓవర్‌లో పరాగ్ (34), హార్దిక్ పాండ్యా(47), నితీశ్‌కుమార్‌రెడ్డి (0) వద్ద అవుటయ్యారు. ఇక… ఇప్పటిదాకా బంగ్లాపై ఎన్నడూ లేని రీతిలో అత్యధిక స్కోరు నమోదు చేశారు. రింకూసింగ్ 8, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు
ఇక.. నిర్ణీత ఒవర్లలో 297 పరుగులు చేసి భారత జట్టు బంగ్లా ముందు అతిపెద్ద టార్గెట్ సెట్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ 3, ముజఫిర్ రహ్మన్, మహదుల్లా, టస్కన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, బంగ్లా జట్టు 298 పరుగుల టార్టెగ్‌ని చేజించాల్సి ఉంది..