బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోర్ 180 దాటించాడు. ఈ క్రమంలోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి 74 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. భారత్‌ను 186 పరుగులకు ఆలౌట్ చేయడంలో షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లదేశ్‌కు బౌలర్లు శుభారంభం ఇచ్చారు. పేసర్ హెబడాట్ హొసేన్ పిచ్ బౌన్స్, పేస్‌ను సద్వినియోగం చేసుకుని నాలుగు వికెట్లు తీశాడు. స్పిన్నర్ షకిబుల్ హసన్‌కు 5 వికెట్లు దక్కాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement