Saturday, June 29, 2024

IND vs AUS | టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

టీ20 వరల్డ్ కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా నేడు భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని… టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇక ఈ పోరులో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి లేదంటే ఇంటిముఖం పట్టాల్సిందే.

జట్ల వివరాలు :

ఇండియా : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికె), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్.

Advertisement

తాజా వార్తలు

Advertisement