Saturday, June 29, 2024

IND vs AUS | బౌండరీలతో హోరెత్తిస్తున్న హిట్‌మ్యాన్..

టీ20 ప్రపంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న హైఓల్టెజ్ మ్యాచ్‌లో… కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్ పునః ప్రారంభమైన తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ.. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిస్తున్నాడు. దీంతో 19 బంతుల్లో 50తో మెరుపు అర్ధశతకం బాడాడు.కాగా, ప్ర‌స్తుతం క్రీజ్ లో రోహిత్ శ‌ర్మ (32 బంతుల్లో 79), సూర్య‌కుమార్ యాద‌వ్ (3 బంతుల్లో 6) ఉన్నారు. ఇక‌ భార‌త్ 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్ల న‌ష్టానికి 100 పరుగులు చేసింది.

ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ రికార్డు శృష్టించాడు. టీ20 ఇంట‌ర్‌‌నేషనల్ క్రికెట్‌లో 200 సిక్స్ లు బాది అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌ 2024లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. దాంతో పాటు టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టి అగ్ర స్థానానికి చేరకున్నాడు.

T20 WC భారత్ తరుఫున అత్యధిక పరుగులు:

రోహిత్ శర్మ: 4150*

విరాట్ కోహ్లీ: 4103

- Advertisement -

KL రాహుల్: 2265

సూర్యకుమార్ యాదవ్: 2259

శిఖర్ ధావన్: 1759

T20 WC 2024లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ…

19 బంతులు – రోహిత్ శర్మ (భారతదేశం) v ఆస్ట్రేలియా*

22 బంతులు – ఆరోన్ జోన్స్ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) v కెనడా

22 బంతులు – క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) v ఇంగ్లాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement