టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు జరుగుతన్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. సిక్సులు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాను ఉతికారేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు బాదింది.
ఓపెనర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయినప్పటికీ… కెప్టెన్ రోహిత్ శర్మ (92) విజృంభించాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రాకార్డ్ క్రియేట్ చేశాడు. ఇక రిషబ్ పంత్ (15)తో వెనుదిరిగాడు.. ఆ తరువాత వచ్చిన సూర్యకుమారి యాదవ్ (31), శివం దూబే (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్), రవీంద్ర జడేజా (9 నాటౌట్) ధనాధన్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత జట్టు ఆస్ట్రేలియా ముందు 206 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేయగలిగింది.
- Advertisement -