Wednesday, December 18, 2024

IND vs AUS: ఆసీస్, భారత్ మూడో టెస్ట్ డ్రా

వ‌ర్షం వ‌ల్ల మూడో టెస్టు డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా విసిరిన టార్గెట్‌ను చేజించేందుకు ఇండియా రెఢీగా ఉన్నా.. వ‌రుణుడు బ్రేక్ ఇవ్వ‌లేదు. దీంతో బ్రిస్బేన్‌ మ్యాచ్‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య ప్ర‌స్తుతం టెస్టు సిరీస్ 1-1తో స‌మంగా ఉంది.

మ‌ద్య గ‌బ్బా మైదానంలో జ‌రిగిన మూడ‌వ టెస్టు డ్రాగా ముగిసింది. 275 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ .. వికెట్ న‌ష్ట‌పోకుండా 8 ర‌న్స్ చేసింది. అయితే టీ బ్రేక్ త‌ర్వాత వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో రెండు జ‌ట్లకు చెందిన ప్లేయ‌ర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చేసుకున్నారు. అయిదు టెస్టుల సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు చెరో విజయాన్ని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

బ్రిస్బేన్‌లో ఆఖ‌రి రోజు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇండియా 260 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌లో 89 ర‌న్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక 275 ర‌న్స్ టార్గెట్‌తో ఇండియా బరిలోకి దిగింది.

- Advertisement -

కానీ వ‌రుణుడి జోక్యంతో మ్యాచ్ డ్రా అయ్యింది. మెల్‌బోర్న్‌లో డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి బాక్సింగ్ డే టెస్టు జ‌ర‌గ‌నున్న‌ది. ఇవాళ ఉద‌యం భార‌త పేస‌ర్లు ఆసీస్‌ను వ‌ణికించారు. బుమ్రా ఈ టెస్టులో మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత‌ను 3 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement