బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో .తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 260 పరుగులకు ఆలౌటైంది. 252/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. పదో వికెట్‌గా ఆకాష్ దీప్(31).. ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం 185 పరుగుల వెనకంజలో భారత్ ఉంది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఆఖరిలో ఆకాష్ దీప్(31), బుమ్రా(10) విరోచిత పోరాటం చేశారు.
దీప్, బుమ్రా నమోదు చేసిన 47 పరుగుల భాగస్వామ్యం ఫలితంగానే భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది.ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 3, హాజిల్‌వుడ్, హెడ్, నాథన్ లియోన్ తలా వికెట్ పడగొట్టారు..
భారత్ అలౌట్ అయిన వెంటనే వర్షం పడటంతో ముందుగానే లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్ లు కోల్పోయింది. ఉస్మాన్ ఖ్వాజా , లంబు షిన్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.