ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ 2024 టోర్నీలో భాగంగా నేడు జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ – ఏ జట్టు పోరాడి ఓడింది. అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన ఈ మ్యాచ్ లో 207 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
భారత – ఏ బ్యాటర్లలో రమణదీప్ సింగ్ (34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు *64) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(7), కెప్టెన్ తిలక్ వర్మ(16) దారుణంగా విఫలమయ్యారు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక మిడిలార్డర్ బ్యాటర్లలో ఆయుష్ బదోని (31), నెహాల్ వధేరా (20), నిశాంత్ సింధు (23) పరుగులకే పరిమితమయ్యారు. దీంతో భారత్ ఎ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్-ఏ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు సెదిఖుల్లా అటల్( 52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో *83), జుబైద్ అక్బారీ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో *64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కరీమ్ జనత్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో *41) రాణించాడు. భారత బౌలర్లలో రసిక్ సలామ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్(1/48) ఒక వికెట్ పడగొట్టాడు.